B.R. Naidu: నేడు భారీ విరాళాలు అందుకున్న టీటీడీ

- ఇటీవల టీటీడీకి భారీగా విరాళాలు
- నేడు రూ.2.45 కోట్ల విరాళాలు
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల నుంచి భారీ విరాళాలు అందుకుంటోంది. ఇవాళ ఏకంగా రూ.2.45 కోట్లు విరాళాల రూపంలో అందాయి. దీనికి సంబంధించిన వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. టీటీడీ చేపడుతున్న వివిధ పథకాలకు భక్తులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారని తెలిపారు.
చెన్నైకి చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం అందించగా, శ్రీలంకకు చెందిన మరో భక్తుడు అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1 కోటి విరాళం ఇచ్చాడని బీఆర్ నాయుడు వివరించారు. నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించినట్టు తెలిపారు.
