Pat Cummins: లక్నో టాస్ గెలిచినా... సన్ రైజర్స్ కే మొదట బ్యాటింగ్

- ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
- టీమ్ లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న సన్ రైజర్స్
- మరోసారి భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తామన్న కమిన్స్
ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొంటున్నాయి. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండడం, సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుండడంతో ఆరెంజ్ ఆర్మీ కోలాహలం మామూలుగా లేదు. ఉప్పల్ స్టేడియంలో ఎటు చూసినా ఆరెంజ్ మయం అయిపోయింది.
ఇక, టాస్ ఓడినా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లభించడంపై ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. మరోసారి భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. టీమ్ లో ఎలాంటి మార్పులు లేవని, గత మ్యాచ్ లో ఆడిన జట్టే బరిలో దిగుతోందని వివరించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.
లక్నో సూపర్ జెయింట్స్
రిషబ్ పంత్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలాస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోనీ, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాటీ, ప్రిన్స్ యాదవ్.