Vizianagaram Police: లారీలో పేకాట... డ్రోన్ సాయంతో ఎలా పట్టుకున్నారో చూడండి!

Watch How Police Used a Drone to Catch Gamblers in a Truck

 


పేకాట రాయుళ్లు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడను, పోలీసులు డ్రోన్ సాయంతో చిత్తు చేశారు. విజయనగరంలో కొందరు వ్యక్తులు నిలిపి ఉంచిన లారీలో పేకాడుతున్నారు. ఖాళీగా ఉన్న లారీ ట్రక్కులో చేరి జోరుగా పేకాడుతున్నారు. బయటి నుంచి చూస్తే లారీ ట్రక్కులో ఏం జరుగుతోందో ఎవరికీ కనిపించదు. 

అయితే, పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఓ డ్రోన్ ను లారీ పైభాగంలోకి పంపించారు. బాగా ఎత్తుకు వెళ్లిన డ్రోన్ కింద ఉన్న విజువల్స్ ను పోలీసులకు చేరవేసింది. దాంతో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆ లారీని చుట్టుముట్టి పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Vizianagaram Police
Drone Surveillance
Gambling Raid
Truck Gambling
Illegal Gambling
Police Operation
Technology in Law Enforcement
India

More Telugu News