Ranya Rao: కన్నడ నటి రన్యా రావుకు కోర్టులో చుక్కెదురు

- బెయిల్ నిరాకరించిన బెంగళూరు సెషన్స్ కోర్టు
- గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు
- బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం
దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యా రావుకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు బెంగళూరులోని సెషన్స్ కోర్టు నిరాకరించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు బెటిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. గోల్డ్ డీలర్ సాహిల్ జైన్‌ను అరెస్టు చేశారు. రన్యా రావు బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు సాహిల్ జైన్ సహకరించినట్లు గుర్తించారు. గతంలోనూ రెండుసార్లు ఆమెకు సహకరించినట్లు దర్యాఫ్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు.