Mandakini: ఓటీటీలో 'మందాకిని' .. ఫస్టు నైట్ వేళ పొరపాటున మద్యం తాగిన పెళ్లికూతురు!

Mandakini Movie Upadate

  • మలయాళంలో విడుదలైన 'మందాకిని'
  • రొమాంటిక్ కామెడీ జోనర్లో అలరించే కంటెంట్
  • ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన సినిమా  
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్

మలయాళ అనువాదాలకు ఓటీటీలలో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. మలయాళ కథల్లోని సహజత్వం... ఆ కథల్లోని చమక్కులను ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందువలన మలయాళ అనువాదాలను తెలుగులో అందించడానికి తెలుగు ఓటీటీలు కూడా పోటీ పడుతున్నాయి. అలా 'ఈటీవీ విన్'కి వచ్చిన సినిమానే 'మందాకిని'.

మలయాళంలో క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన 'మందాకిని' సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కేవలం కోటి రూపాయల లోపు బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 3 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అల్తాఫ్ సలీమ్ - అనార్కలి మరిక్కర్ జంటగా నటించిన ఈ సినిమాకి, వినోద్ లీలా దర్శకత్వం వహించారు. కామెడీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి మార్కులు పడ్డాయి  

కథలోకి వెళితే... పెద్దల సమక్షంలో అరోమల్ - అంబిలి పెళ్లి జరుగుతుంది. సంప్రదాయ పద్ధతిలోనే వారి ఫస్టు నైట్ కి ఏర్పాట్లు చేస్తారు. అయితే అరోమల్ స్నేహితులు సరదా కోసం కూల్ డ్రింక్ లో మద్యం కలిపి అతని గదికి పంపిస్తారు. అయితే పొరపాటున ఆ మద్యం కలిపిన కూల్ డ్రింక్ ను అంబిలి తాగుతుంది. ఆ మత్తులో... పెళ్లికి ముందు తన లైఫ్ లో జరిగిన ప్రేమాయణం గురించి చెబుతుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ. 

Mandakini
Malayalam Movie
OTT Release
Etv Win
Althaf Salim
Anarkali Marikar
Vinod Leema
Comedy Movie
Malayalam Dubbed Movies
Indian Cinema
  • Loading...

More Telugu News