Hind: తన కూతురుకి 'హింద్' అని పేరు పెట్టిన దుబాయ్ యువరాజు

Dubai prince named his daughter Hind

  • నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భార్య
  • తన తల్లి గౌరవార్థం హింద్ అని పేరు పెట్టిన యువరాజు
  • ఇన్స్టా ద్వారా విషయాన్ని వెల్లడించిన షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ భార్య షేఖా షైఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మక్తౌమ్ గత శనివారం నాలుగో బిడ్డకు జన్మనిచ్చారు. ఆడబిడ్డకు వారు 'హింద్' అనే పేరు పెట్టారు. హింద్ బింట్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తౌమ్ గా నామకరణం చేశారు. షేక్ హమ్దాన్ తల్లి షేఖా హింద్, బింట్ మక్తౌమ్ బిన్ జుమా అల్ మక్తౌమ్ గౌరవార్థం చిన్నారికి ఈ పేరు పెట్టారు. ఈ విషయాన్ని షేక్ హమ్దాన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. 

చిన్నారి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అల్లాహ్ ని ప్రార్థిస్తున్నామని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. 'హింద్' అనే పదం అరబిక్ మూలానికి చెందినది. సంపద, బలం, గొప్పదనాన్ని ఇది సూచిస్తుంది. షేక్ హమ్దాన్ దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేఖా హింద్ లకు రెండో సంతానం. యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తన బంధువు షేఖా షైఖాని 2019లో పెళ్లి చేసుకున్నారు.

Hind
Dubai Prince
Daughter
  • Loading...

More Telugu News