Stock Market: నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు

Stock Market revives from yesterday loses

  • 317 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 105 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5.56 శాతం పతనమైన టాటా మోటార్స్ షేర్లు

నిన్నటి భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఆటో దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఈ ఉదయం నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. టెలికాం, ఫార్మా, ఆటో సూచీలు మినహా అన్ని సూచీలు ఈరోజు రాణించాయి. 

ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317 పాయింట్ల లాభంతో 77,606 వద్ద ముగిసింది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 23,591 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (3.23%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.68%), ఎన్టీపీసీ (1.88%), ఎల్ అండ్ టీ (1.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.40%).

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-5.56%), సన్ ఫార్మా (-1.41%), కోటక్ బ్యాంక్ (-0.95%), భారతి ఎయిర్ టెల్ (-0.82%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.40%).

Stock Market
Sensex
Nifty
  • Loading...

More Telugu News