Fire Accident: రంగారెడ్డి జిల్లాలో కారులో మంటలు

- చేవెళ్ల మండలం కందవాడ స్టేజ్ సమీపంలో ప్రమాదం
- కేసారం గ్రామవాసి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం
- ప్రమాదాన్ని గుర్తించి కారులో నుంచి దిగిపోయిన రాజశేఖర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజ్ సమీపంలో ఓ కారులో నుంచి మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి ప్రమాదాన్ని గుర్తించి కారులో నుంచి కిందకు దిగిపోయాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు కారు యజమాని తెలిపారు. విషయం తెలియగానే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.