Rashmika Mandanna: గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 9 నెలల సమయం పడుతుంది: రష్మిక మందన్న

Rashmika Mandanna Injury Update

  • ఇటీవల జిమ్ లో గాయపడ్డ రష్మిక మందన్న
  • గాయం ఇప్పుడిప్పుడే నయమవుతోందని వెల్లడి
  • పరిస్థితి బెటర్ గా ఉందన్న రష్మిక

బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయిన రష్మిక మందన్న ఇటీవల గాయపడ్డ సంగతి తెలిసిందే. జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె గాయపడింది. గాయం కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగులకు దూరంగా ఉంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రష్మిక... తన గాయం గురించి మాట్లాడారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నానని ఆమె తెలిపింది. కాలికి అయిన గాయం ఇప్పుడిప్పుడే నయమవుతోందని... కానీ, పూర్తిగా సెట్ కావాలంటే మరో 9 నెలల సమయం పడుతుందని చెప్పింది. పరిస్థితి బెటర్ గానే ఉందని... వర్క్ లైఫ్ లో ఫుల్ బిజీ అయిపోయానని తెలిపింది. 

సినిమాల విషయానికి వస్తే... బాలీవుడ్ లో ఆమె నటించిన 'చావా' సినిమా సూపర్ హిట్ అయింది. సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన 'సికందర్' విడుదలకు సిద్ధంగా ఉంది. 'ది గర్ల్ ఫ్రెండ్', 'కుబేర', 'రెయిన్ బో' చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 

Rashmika Mandanna
Injury
Recovery
Bollywood
Chaava
Sikandar
The Girl Friend
Kuber
Rain Bow
Salman Khan
  • Loading...

More Telugu News