Manchu Vishnu: ప్రభాస్ మాటవరసకు కూడా నాతో అనలేదు: మంచు విష్ణు

Manchu Vishnu Interview

  • 'కన్నప్ప' ప్రమోషన్స్ లో మంచు విష్ణు 
  • కథకి తగిన లొకేషన్స్ దొరికాయని వెల్లడి 
  • ఈ సినిమా చేయాలనుందని ప్రభాస్ అనలేదని వ్యాఖ్య 
  • అలా అనుంటే తాను ఈ ప్రాజెక్టు చేసేవాడిని కాదని వివరణ
  • ఇదంతా శివయ్య అనుగ్రహమేనని స్పష్టీకరణ


 మంచు విష్ణు కథానాయకుడిగా 'కన్నప్ప' సినిమా రూపొందింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో మంచు విష్ణు బిజీగా ఉన్నాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు. 'కన్నప్ప' కథను మరోసారి ప్రపంచానికి చెప్పడానికి ఆ శివుడు నన్ను ఎంచుకున్నాడని నేను భావిస్తున్నాను. లేకపోతే ఇంతమంది స్టార్స్ తో నేను ఈ సినిమా చేయడం ఏమిటి? అని అన్నాడు. 
       
'భక్త కన్నప్ప' సినిమాలో రావు గోపాలరావు గారు చేసిన పాత్రను ఈ సినిమాలో నాన్నగారు చేశారు. అయితే ఆ పాత్ర తీరుతెన్నులను మార్చడం జరిగింది. అలాగే 'కన్నప్ప' గురించి ఇంతవరకూ ప్రపంచానికి తెలిసిన విషయాలను అలాగే ఉంచి, మిగతా విషయాలను ఊహించి తయారు చేసుకోవడం జరిగింది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పరుచూరి గోపాలకృష్ణ గారు ఎంతగానో సహకరించారు. ఈ కథకి అవసరమైన లొకేషన్స్ దొరకడం కూడా ఆ శివయ్య అనుగ్రహమేనని అనుకుంటున్నాను" అని చెప్పాడు. 

" ఇక ఈ సినిమాను ప్రభాస్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది అంటున్నారు. ఈ కథను తనకి చేయాలని ఉందని ప్రభాస్ ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ ఈ సినిమా చేయాలని ఉందని నాతో ప్రభాస్ అంటే, నేను ఈ కథ జోలికి వెళ్లే వాడిని కాదు. కృష్ణంరాజు గారు ఉన్నప్పుడే, ఆయనతో ఈ ప్రాజెక్టును గురించి మాట్లాడి .. ఆయన ఆశీస్సులను అందుకోవడం జరిగింది. ఈ సినిమాలో శ్రీకాళహస్తిలో శివలింగం ఎలా ఉంటుందో అలాగే చూపించగలిగాననే ఒక సంతృప్తి నాకు ఉంది" అని అన్నాడు. 

Manchu Vishnu
Kannappa
Prabhas
Telugu Cinema
April 25 Release
Tollywood
New Movie
Paruchuri Gopalakrishna
Krishna Raju
Sri kalahasti
  • Loading...

More Telugu News