Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా?

- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు
- మంగళవారం ముగిసిన ఇరుపక్షాల వాదనలు
- ఈరోజు తీర్పును వెలువరించనున్న సీఐడీ కోర్టు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఈరోజు సీఐడీ కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ పిటిషన్ పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని... బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీఐడీ వాదనలు వినిపించింది.
ఈ కేసును రాజకీయ కక్షలో భాగంగా పెట్టారని... వంశీ అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు ఈరోజు తీర్పును వెలువరించనుంది. వంశీకి బెయిల్ వస్తుందా? రాదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.