Krishna's Nephew: కృష్ణ సోదరుడి మనవడు, మనవరాలి బారసాల కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మనవడు, మనవరాలి బారసాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. కవలలైన ఈ చిన్నారులకు తాడేపల్లి పట్టణంలోని పార్క్ విల్లాలో బారసాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, లోకేశ్ చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

