UPI: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం

Nationwide UPI Service Disruption

  • యూపీఐ సర్వర్ డౌన్
  • తీవ్ర ఇబ్బందులుపడుతున్న వినియోగదారులు
  • గంటకు పైగా నిలిచిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సేవలు

దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్‌లైన్ సేవలు దాదాపు గంటకు పైగా నిలిచిపోయాయి.

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు. పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వివిధ ప్రాంతాల్లో ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలనుకున్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు.

సాయంత్రం ఏడు గంటల తర్వాత యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. యూపీఐపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

UPI
UPI Server Down
PhonePe
Google Pay
Paytm
Digital Payment Disruption
UPI Outage
  • Loading...

More Telugu News