Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట

- వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ పై సీఐడీ కేసు నమోదు
- మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీఐడీ
- ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు
ఏపీ లిక్కర్ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని సీఐడీకి ఫిర్యాదులు అందాయి. దీంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. దీంతో, ఆయన ముందస్తు బెయిల్ కోసం గతంలోనే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డికి తాత్కాలిక ఊరటను కల్పించింది. మిథున్ రెడ్డి పిటిషన్ పై ఏప్రిల్ 3న తీర్పును వెలువరిస్తామని... అంతవరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సీఐడీ పోలీసులను ఆదేశించింది.
మరోవైపు, టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నిన్న లోక్ సభలో ఏపీ లిక్కర్ కుంభకోణం అంశాన్ని లేవనెత్తారు. సభ కొనసాగుతుండగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కృష్ణదేవరాయలును పార్లమెంట్ లోని తన కార్యాలయానికి పిలిపించుకుని లిక్కర్ స్కామ్ గురించి వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.