KA Paul: చంద్రబాబుకు మెసేజ్ చేసినా రెస్పాన్స్ రాలేదు: కేఏ పాల్

KA Paul Demands CBI Probe into Pastor Praveen Kumars Death

  • రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ కు పోస్టుమార్టం
  • కేసును సీబీఐకి అప్పగించాలన్న కేఏ పాల్
  • ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్య

రాజమండ్రి శివార్లలో జరిగిన ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మరోవైపు ఆసుపత్రి వద్దకు చేరుకున్న కేఏ పాల్ పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీ వద్దకు వెళ్లారు. పోస్టుమార్టం ప్రక్రియను తాను కూడా పరిశీలిస్తానని చెప్పారు. అయితే, పోస్టుమార్టం గదిలోకి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనితకు మెసేజ్ లు చేసినా వారి నుంచి రెస్పాన్స్ రాలేదని తెలిపారు. ప్రవీణ్ మృతిపై క్రైస్తవులకు ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలని చెప్పారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఆధారాలతో వివరించాలని కోరారు.

  • Loading...

More Telugu News