Bhadrachalam: భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

Bhadrachalam Building Collapse Six Storey Structure Crumbles

  • భ‌ద్రాచ‌లం సూప‌ర్ బ‌జార్ సెంటర్‌లో పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద ఘ‌ట‌న‌
  • ఈ ప్ర‌మాదంలో ప‌లువురి మృతి
  • శిథిలాల కింద న‌లుగురు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం

భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. భ‌ద్రాచ‌లం సూప‌ర్ బ‌జార్ సెంటర్‌లో పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద‌ నిర్మాణంలో ఉన్న ఆరంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు మృతిచెంద‌గా, శిథిలాల కింద న‌లుగురు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. 

అయితే, పాత భ‌వ‌నంపైనే మ‌రో నాలుగు అంత‌స్తులు నిర్మిస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది. నిర్వాహ‌కులు ట్ర‌స్ట్ పేరుతో విరాళాలు సేక‌రించి భ‌వ‌న నిర్మాణం చేస్తున్న‌ట్లు స‌మాచారం. నిర్మాణంలో లోపాల వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు అధికారులు భావిస్తున్నారు. ఘ‌ట‌న స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. పోలీసు, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.  


  • Loading...

More Telugu News