Donald Trump: ఏడు రోజుల లాభాలకు బ్రేక్.. మార్కెట్లకు భారీ నష్టాలు

Sensex Down 728 Points

  • 728 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 181 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • మూడున్నర శాతం నష్టపోయిన ఎన్టీపీసీ

గత ఏడు సెషన్లుగా లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. భారత్ పై టారిఫ్ ల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో, సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 728 పాయింట్లు కోల్పోయి 77,288కి పడిపోయింది. నిఫ్టీ 181 పాయింట్లు నష్టపోయి 23,486 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.94%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.43%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.22%), టైటాన్ (0.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.07%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-3.54%), జొమాటో (-3.10%), టెక్ మహీంద్రా (-2.85%), బజాజ్ ఫైనాన్స్ (-2.28%), యాక్సిస్ బ్యాంక్ (-2.14%).

  • Loading...

More Telugu News