Officer on Duty: ఈ మధ్య కాలంలో ఇంతలా భయపెట్టిన విలన్ గ్యాంగ్ ఇదే!

Officer on Duty Movie Update

  • నెట్ ఫ్లిక్స్ లో 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విలన్ గ్యాంగ్
  • తమ పాత్రల్లో జీవించిన విధానం హైలైట్  
  • వాళ్ల గురించే మాట్లాడుకుంటున్న ఆడియన్స్ 


సాధారణంగా ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు హీరోయిజానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు .. హీరోయిన్ మరింత గ్లామరస్ గా మెరిసిన సీన్స్ .. లేదంటే కడుపుబ్బా నవ్వించిన కామెడీ సీన్స్ మనతో ఇంటివరకూ వస్తుంటాయి. ఒకప్పుడు విలనిజం .. ఆ విలన్స్ చేసే మేనరిజం కూడా జనంలోకి బాగా వెళ్లేవి. కానీ ఈ మధ్య కాలంలో స్టైలిష్ గా కనిపిస్తూ కంగారు పెట్టేసే విలనిజం మాత్రం ఇక్కడి ఆడియన్స్ కి తారసపడలేదనే చెప్పాలి. 

అయితే 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమా చూసిన వాళ్లంతా, ఆ సినిమాలోని విలన్ గ్యాంగ్ గురించి మాట్లాడుకోవడం విశేషంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో పోలీస్ విచారణలో ఒక యువకుడు చనిపోతాడు. అయితే ఆ వ్యక్తి డ్రగ్స్ బ్యాచ్ కి చెందినవాడు. అందువలన ఆ బ్యాచ్ ఆ పోలీస్ ఆఫీసర్ పై పగబడుతుంది. ఆ బ్యాచ్ కోసం పోలీస్ ఆఫీసర్ వేటాడుతూ ఉంటే, వాళ్లు అతణ్ణి ఫాలో అవుతూ ఉంటారు. అవకాశం దొరికితే వేసేయాలనే ప్రతీకారంతో ఉంటారు. 

ఈ నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆడియన్స్ ను భయపెట్టేస్తాయి. మాదక ద్రవ్యాలు .. సెక్స్ .. విచ్చలవిడితనానికి అలవాటుపడిన విలన్ గ్యాంగ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. వాళ్లు యాక్ట్ చేస్తున్నారా? .. జీవిస్తున్నారా? అనే డౌట్ వస్తుంది. అంతగా తమ పాత్రలలో ఇన్వాల్వ్ అయ్యారు. ముగ్గురు అబ్బాయిలు .. ఇద్దరు అమ్మాయిలు కలిసి కనిపించే ఈ విలన్ గ్యాంగ్ యాక్టింగు కోసమైనా,ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ మరిచిపోలేని విలన్ గ్యాంగ్ ఇదేనని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

  • Loading...

More Telugu News