Rashid Khan: ఐపీఎల్‌లో ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త‌.. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించిన స్పిన్న‌ర్‌!

Rashid Khan Achieves Rare Feat in IPL

  • అత్యంత వేగంగా 150 వికెట్ల ఫీట్ అందుకున్న బౌల‌ర్ల జాబితాలో ర‌షీద్ మూడో స్థానం
  • కేవ‌లం 122 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు ప‌డ‌గొట్టిన స్పిన్న‌ర్‌
  • 124 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్న బుమ్రా
  • ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో మలింగ (105), చాహల్ (118)

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌల‌ర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో నిన్న రాత్రి జరిగిన జీటీ సీజన్ ఓపెనర్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు. అత‌డు కేవ‌లం 122 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్ట‌డం విశేషం. 

ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) బౌల‌ర్‌ జస్ప్రీత్ బుమ్రాను అధిగమించి ర‌షీద్‌ ఈ మైలురాయిని అందుకున్నాడు. బుమ్రా 124 మ్యాచ్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించాడు. కాగా, ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో లసిత్ మలింగ (105), యుజ్వేంద్ర చాహల్ (118) ఉన్నారు. కాగా, అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల లిస్టులో 205 వికెట్ల‌తో చాహ‌ల్ అగ్ర‌స్థానంలో ఉంటే... ర‌షీద్ 11వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

ఇక మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన ఐపీఎల్ 5వ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) 11 ప‌రుగుల తేడాతో మ‌ట్టిక‌రిపించిన విష‌యం తెలిసిందే. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 243 ప‌రుగులు చేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (97 నాటౌట్‌) భారీ ఇన్నింగ్‌కు తోడు ఇత‌ర బ్యాట‌ర్లు కూడా రాణించ‌డంతో గుజ‌రాత్ భారీ స్కోర్ న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత 244 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ్యాటింగ్ ప్రారంభించిన‌ గుజ‌రాత్ 232 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. 

  • Loading...

More Telugu News