Rakadhan: ఓటీటీలో .. మర్డర్ చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్!

- తమిళంలో రూపొందిన 'రాకధన్'
- 2023లో థియేటర్లకు వచ్చిన సినిమా
- అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి
- ప్రధానమైన పాత్రల్లో వంశీకృష్ణ - సంజన సింగ్
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లోని కథలను ప్రేక్షకులు మరింత ఇంట్రెస్టింగ్ గా ఫాలో అవుతూ ఉంటారు. అందువలన ప్రతివారం ఈ జోనర్లోని కంటెంట్ ను వదలడానికి ఓటీటీ సెంటర్లు పోటీపడుతూ ఉంటాయి. అలా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి ఒక తమిళ సినిమా వచ్చింది .. ఆ సినిమా పేరే 'రాకధన్'. దినేశ్ కలైసెల్వన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2023లో థియేటర్లకు వచ్చింది.
కథలోకి వెళితే .. పోలీస్ ఆఫీసర్ అజ్మల్ ముందుకు ఒక మర్డర్ కేసు వస్తుంది. అర్జున్ అనే యువకుడి దారుణమైన హత్యకు సంబంధించిన కేసు అది. అలెక్స్ అనే బిజినెస్ మెన్ దగ్గర అర్జున్ పనిచేస్తూ ఉంటాడు. అలెక్స్ చేసేది చీకటి వ్యాపారాలు కావడం వలన అతనే అర్జున్ ను హత్య చేసి ఉంటాడని అజ్మల్ భావిస్తాడు. ఆ హత్య వెనుక తన లవర్ కూడా ఉందనే నిజం అప్పుడే అజ్మల్ కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేది మిగతా కథ.