KTR: కేటీఆర్ పై రెండు కేసులు నమోదు

Two Cases Filed Against KTR

  • నకిరేకల్ లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం
  • కేటీఆర్ తనపై ఆరోపణలు చేశారంటూ రజిత ఫిర్యాదు
  • నిందితులతో తనకు సంబంధాలు ఉన్నాయని ట్వీట్ చేశారన్న రజిత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. నకిరేకల్ లో పదో తరగతి తెలుగు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని నకిరేకల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాస్ కాపీయింగ్ నిందితులతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. 

కేటీఆర్ తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. నిందితుడు చిట్ల ఆకాశ్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. ఈ క్రమంలో కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత ఉగ్గడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదయింది.

KTR
K.T. Rama Rao
Nalgonda
Nakerkal
Telugu Question Paper Leak
False Allegations
Criminal Case
Rajitha
Uggade Srinivas
Brs Working President
  • Loading...

More Telugu News