Chandrababu: జపాన్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్ర‌బాబు సమావేశం

Chandrababu Naidu Meets Japanese Delegation in Amaravati

    


రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఈరోజు జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో స‌మావేశమైన‌ట్లు సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఈ భేటీలో ప‌ర‌స్ప‌ర స‌హ‌య‌స‌హ‌కారాల‌పై కీల‌క చ‌ర్చ జ‌రిగిన‌ట్లు ముఖ్య‌మంత్రి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వెల్ల‌డించారు. 

"ఈరోజు అమరావతిలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాం. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, ఆంధ్రప్రదేశ్‌లో జపాన్ పెట్టుబడులను విస్తరించడంపై చ‌ర్చ‌లు జ‌రిగాయి. వృద్ధికి కొత్త అవకాశాలను అందించడానికి నౌకానిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్య వంటి వివిధ రంగాలలో సహకారాన్ని అన్వేషించడంపై మా చర్చలు కొన‌సాగాయి" అని సీఎం చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 

More Telugu News