MAD Square Trailer: 'మ్యాడ్ స్క్వేర్' ట్రైల‌ర్ వ‌చ్చేసింది!

Mad Square Trailer Released

    


వినోదాత్మక చిత్రం 'మ్యాడ్' 2023లో విడుదలై ఘనవిజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' వ‌స్తోంది. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా మేక‌ర్స్ ఈ చిత్రం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. 

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్  సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచారు. దీంతో 'మ్యాడ్ స్క్వేర్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యువత ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగానికి బాణీలు అందించిన‌ భీమ్స్ సిసిరోలియోనే రెండో పార్ట్‌కు కూడా సంగీతం అందిస్తున్నారు. 

MAD Square Trailer
Kalyan Shankar
Narne Nithin
Sangith Shobhan
Ram Nithin
Sithara Entertainments
Bheems Ceciroleo
Telugu Movie
Tollywood

More Telugu News