Reserve Bank of India: ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే!

- ఏప్రిల్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు
- వచ్చే నెలకు సంబంధించి బ్యాంకు సెలవులను ప్రకటించిన ఆర్బీఐ
- ఏప్రిల్‌లో ప్రత్యేక పండుగలు, రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కలుపుకుని 13 సెలవు దినాలు
మార్చి నెల ముగింపుకు చేరుకుని ఏప్రిల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి నెలా మాదిరిగానే వచ్చే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను ప్రకటించింది.
ఏప్రిల్ నెలలో మొత్తం 13 రోజులు సెలవులు ఉన్నాయి. వివిధ పండుగలు, రెండవ మరియు నాల్గవ శనివారాలు, ఆదివారాలు కలిసి ఈ సెలవుల జాబితాలో ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి.
**ఏప్రిల్ నెలలో సెలవుల వివరాలు:**
* ఏప్రిల్ 6: ఆదివారం - శ్రీరామనవమి
* ఏప్రిల్ 10: గురువారం - జైనమత 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ జయంతి
* ఏప్రిల్ 12: రెండవ శనివారం
* ఏప్రిల్ 13: ఆదివారం
* ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి
* ఏప్రిల్ 15: బోహాగ్ బిహు పండుగ సందర్భంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కోల్‌కతా, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
* ఏప్రిల్ 16: బోహాగ్ బిహు సందర్భంగా గౌహతిలో బ్యాంకులకు సెలవు
* ఏప్రిల్ 20: ఆదివారం
* ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు
* ఏప్రిల్ 26: నాల్గవ శనివారం
* ఏప్రిల్ 27: ఆదివారం
* ఏప్రిల్ 29: పరుశురామ జయంతి
* ఏప్రిల్ 30: బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు సెలవు