Shobitha Akkineni: అరుణాచలంలో సందడి చేసిన శోభిత అక్కినేని..ఫోటోలు ఇవిగో

- గత ఏడాది డిసెంబర్ లో జరిగిన నాగచైతన్య, శోభిత వివాహం
- అరుణాచల క్షేత్రంలో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శోభిత
నాగచైతన్య అర్ధాంగి శోభిత అక్కినేని అరుణాచలంలో సందడి చేశారు. నాగచైతన్య, శోభితల వివాహం గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన విషయం విదితమే.
వీరి వివాహం తరువాత శోభిత సినిమాల్లో నటిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమె పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.
ఈ క్రమంలో అరుణాచల క్షేత్రంలో సందడి చేసిన శోభిత అక్కినేని, అక్కడ వివిధ భంగిమల్లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



