TGRTC: టీజీఎస్ఆర్టీసీ శుభవార్త: మీ ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు డెలివరీ

- తలంబ్రాలు ఇంటికి పంపించేందుకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ
- ఏప్రిల్ 6వ తేదీన భద్రాద్రిలో రాములోరి కల్యాణం
- రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకుంటే ఇంటికే తలంబ్రాలు
భక్తులకు శుభవార్త! పవిత్ర భద్రాద్రి సీతారాముల కల్యాణం తలంబ్రాలను మీ ఇంటికే పంపించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఏప్రిల్ 6వ తేదీన భద్రాద్రిలో రాములవారి కల్యాణం వైభవంగా జరగనుంది. గత ఏడాది కూడా భక్తులకు తలంబ్రాలను ఇంటికి చేరవేసింది. దేవాదాయ శాఖ సహకారంతో స్వామివారి కల్యాణ తలంబ్రాలను ఈసారి కూడా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చే కార్యక్రమానికి టీజీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.
శ్రీ సీతారాముల వారి కల్యాణం తలంబ్రాలు కావాలసిన భక్తులు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ. 151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలి. కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు ఇంటికి పంపిస్తారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కాల్ సెంటర్ నెంబర్లు 040-69440069, 040-69440000 లను సంప్రదిస్తే టీజీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు ఆర్డర్లను స్వీకరిస్తారని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.