Gujarat Titans: ఐపీఎల్ లో నేడు పంజాబ్ × గుజరాత్... టాస్ అప్ డేట్ ఇదిగో!

- తాజా సీజన్ లో తమ తొలి మ్యాచ్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్
- అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
ఐపీఎల్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ఆడుతున్నాయి. ఈ రెండు జట్లకు సీజన్ లో ఇదే తొలి మ్యాచ్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ పోరుకు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉండడంతో పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్ మాన్ గిల్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రబాడా, రషీద్ ఖాన్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
అటు, పంజాబ్ జట్టు కూడా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కె యన్సెన్, అర్షదీప్, యుజువేంద్ర చహల్ తో పటిష్టంగా కనిపిస్తోంది.