Kakani Govardhan: దేనికైనా సిద్ధంగా ఉన్నా: కాకాణి గోవర్ధన్

Kakani Govardhan response on new case against him

  • కాకాణిపై క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసు
  • హామీలు అమలు చేయాలని అడిగితే కేసులు పెడుతున్నారన్న కాకాణి
  • కేసులకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్య

తాటిపర్తిలో క్వార్ట్జ్ అక్రమ రవాణా అభియోగాల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటి వరకు తనపై ఆరు కేసులు నమోదయ్యాయని, నిన్న మరో కేసు పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తన గళాన్ని వినిపిస్తున్నానని చెప్పారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కేసులు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు. ఏదో ఒక రకంగా తనపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. తాజాగా క్వార్ట్జ్ కి సంబంధించి కేసు పెట్టారని దుయ్యబట్టారు. తాను తప్పు చేయలేదని... దేనికైనా సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.

  • Loading...

More Telugu News