Amy Jackson: మరో బిడ్డకు జన్మనిచ్చిన సినీ నటి అమీ జాక్సన్

- తాను మరోసారి తల్లి అయిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన అమీ
- కొడుకుకి అస్కార్ అలెగ్జాండర్ వెస్ట్ విక్ అని పేరు పెట్టినట్టు వెల్లడి
- గతంలో ఓ బిజినెస్ మేన్ తో తొలి బిడ్డను కన్న అమీ
సినీ నటి అమీ జాక్సన్ మరోసారి తల్లి అయింది. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొడుకుకి ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్ విక్ అని పేరు పెట్టినట్టు తెలిపింది. బాబు, భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. మరోసారి తల్లి అయిన అమీకి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
అమీ జాక్సన్ తొలుత మోడల్ గా రాణించింది. తమిళ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2010లో వచ్చిన 'మద్రాస్ పట్టణం' సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్ చిత్రం 'ఎవడు'లో నటించింది.
గతంలో జార్జ్ పనయోట్టు అనే బిజినెస్ మేన్ తో అమీ జాక్సన్ రిలేషన్ లో ఉంది. 2019లో వీరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే, పెళ్లి చేసుకోకుండానే ఆయనతో ఆండ్రెస్ అనే కుమారుడికి జన్మనిచ్చింది. అమీ, పనయోట్టుల ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు. 2022లో వీరు విడిపోయారు. ఆ తర్వాత అమీ హాలీవుడ్ నటుడు వెస్ట్ విక్ తో ప్రేమలో పడింది. దక్షిణ ఇటలీలోని 16వ శతాబ్దం నాటి కాస్టెల్లో రోకో కోటలో వీరు వివాహం చేసుకున్నారు.
