Jeevan Reddy: పదవులు రాకుంటే అసంతృప్తి సహజమే: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

- తానూ అసంతృప్తితోనే ఉన్నానన్న జీవన్ రెడ్డి
- మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం పచ్చజెండా
- ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత
పదవులు రాకుంటే ఎవరికైనా అసంతృప్తి కలగడం సహజమేనని, ప్రస్తుతం తాను కూడా అసంతృప్తితోనే ఉన్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం ఆమోదం తెలిపిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిన్న పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కే.సీ. వేణుగోపాల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చించారు.