Andhra Pradesh Government: ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

- వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ప్రకటించిన మున్సిపల్ శాఖ
- ప్రజల నుంచి వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన
- కోట్లాది రూపాయల బకాయిలు వసూలు అవుతాయని భావిస్తున్న ప్రభుత్వం
ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పన్ను బకాయిదారులకు రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పన్ను చెల్లించేవారికి వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది.
ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ నిర్ణయంతో కోట్లాది రూపాయల బకాయిలు వసూలు అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో పన్ను బకాయి పడ్డవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.