Ranaya Rao: రన్యా రావు కేసులో కోర్టుకు కీలక విషయాలు వెల్లడించిన అధికారులు

Actress Ranaya Rao Confesses to Using Hawala for Gold Purchase

  • విదేశాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు హవాలా డబ్బు వినియోగించినట్లు తెలిపిన అధికారులు
  • ఈ విషయాన్ని స్వయంగా రన్యా రావు అంగీకరించారని కోర్టుకు తెలిపిన డీఆర్ఐ న్యాయవాది
  • రన్యా రావు విచారణ సందర్భంగా వెల్లడైన విషయాలను కోర్టుకు తెలిపిన న్యాయవాది

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కోర్టుకు కీలక విషయాలు తెలియజేసింది. విదేశాల్లో బంగారం కొనుగోలు చేయడానికి ఆమె హవాలా డబ్బును ఉపయోగించినట్లు డీఆర్ఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని రన్యా రావు స్వయంగా విచారణలో అంగీకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

బంగారం కొనుగోలు కోసం హవాలా మార్గాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు రన్యా రావు అంగీకరించారని డీఆర్ఐ తెలిపింది. రన్యా రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా డీఆర్ఐ తమ విచారణలో వెల్లడైన విషయాలను కోర్టుకు వివరించింది.

బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రన్యా రావు ఈ నెల 3వ తేదీన బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఈ కేసులో మరో నిందితుడు తరుణ్‌రాజ్‌కు ఆమె ఆర్థిక సహాయం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆమె పంపిన డబ్బుతోనే అతడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News