BSE Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- 32 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 10 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5.79 శాతం పతనమైన జొమాటో షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు పాజిటివ్ గానే ప్రారంభమైనప్పటికీ... ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు ఆవిరయ్యాయి. చివరకు ఫ్లాట్ గా ముగిశాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 78,017 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 23,668 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.41%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.71%), ఇన్ఫోసిస్ (2.48%), యాక్సిస్ బ్యాంక్ (1.97%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.13%).
టాప్ లూజర్స్:
జొమాటో (-5.79%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.76%), అదానీ పోర్ట్స్ (-1.44%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.39%), రిలయన్స్ (-1.23%).