Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ

Telangana Speaker Raises Concerns Over Konocarpus Trees

  • తమ ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామన్న వేముల
  • వాటిలో హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు ఎక్కువగా ఉన్నాయన్న స్పీకర్
  • వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తిర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీనివల్ల రాష్ట్రంలో అటవీ కవచం 7 శాతం పెరిగిందని చెప్పారు. 

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ... గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కల్లో ప్రజలకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అన్నారు. ఈ చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తికి హానికరంగా మారతాయని... పక్షులకు కూడా సహజమైన వాతావరణాన్ని అందించలేవని చెప్పారు. 

వేముల మాట్లాడుతూ... ఈ చెట్లను కొద్ది సంఖ్యలోనే నాటామని చెప్పారు. మీరు చెప్పింది కరెక్ట్ కాదని... ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటారని స్పీకర్ కౌంటర్ ఇచ్చారు. హైవేలు, డివైడర్లు సహా అనేక ప్రాంతాల్లో ఈ చెట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 

  • Loading...

More Telugu News