Sonali Sonu Sood: రోడ్డు ప్రమాదంలో సోనూ సూద్ భార్యకు గాయాలు

- సోనూ సూద్ భార్య, ఆమె సోదరికి రోడ్డు ప్రమాదం
- ముంబై-నాగ్‌పూర్ హైవేపై ఘటన
- ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు
- ప్రమాద సమయంలో కారు నడుపుతున్న సోనూ మేనల్లుడు
ప్రముఖ నటుడు సోనూ సూద్ అర్ధాంగి సోనాలి, ఆమె సోదరి సుమితా సాల్వే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై-నాగ్‌పూర్ హైవేపై సోనూ సూద్ భార్య సోనాలి (54), ఆమె సోదరి సుమితా సాల్వే (55) ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో గాయపడ్డారు.
సోనాలి, సుమితా నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో సోనాలి మేనల్లుడు కారు నడుపుతున్నట్టు తెలిసింది.
సోనేగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్ధా రోడ్ ఫ్లైఓవర్ మీద ఈ ప్రమాదం జరిగింది. మ్యాక్స్ హాస్పిటల్ వైద్యుడు అభిజీత్ భాట్కుల్కర్ తెలిపిన వివరాల ప్రకారం... సోనాలి, సుమిత ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. స్వల్ప గాయాలైన సోనాలి మేనల్లుడికి ప్రథమ చికిత్స చేసి పంపించేశారు.