Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddys Key Remarks on Ministerial Post

  • మంత్రి పదవి వస్తుందనే ఆశాభావంతో ఉన్నానని రాజగోపాల్ రెడ్డి వెల్లడి
  • హోంమంత్రిత్వ శాఖ అంటే ఆసక్తి అన్న రాజగోపాల్ రెడ్డి
  • అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తానని వెల్లడి

కాంగ్రెస్ పార్టీ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, హోంమంత్రిత్వ శాఖ అంటే తనకు ఆసక్తి ఉన్నప్పటికీ, అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడతానని అన్నారు. ప్రస్తుతానికి తనకు ఢిల్లీ నుండి ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించారు.

నిన్న ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. మంత్రి వర్గ విస్తరణతో సహా పలు అంశాలపై వారు చర్చించారు. వివిధ సామాజిక వర్గాల నుంచి నలుగురు లేదా ఐదుగురికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News