Telangana: ఏప్రిల్ 3న తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణం..?

- తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్
- నలుగురు కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం
- ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నలుగురు కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఏప్రిల్ 3న వీరి ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని తెలుస్తోంది. ఇక నలుగురు మంత్రుల్లో ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం.
ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుందని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గంలో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఎస్సీలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి... బీసీ సామాజిక వర్గంలో ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్‌లకు చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగింటిని భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మరో స్థానం భర్తీ చేయాలనుకుంటే మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.