Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగింపు

Vallabhaneni Vamsis Remand Extended to April 8th

  • సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇటీవల వంశీ అరెస్ట్
  • నేటితో ముగిసిన రిమాండ్
  • మరోసారి రిమాండ్ పొడిగించిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు

గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సత్యవర్ధన్ అనే దళిత యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా, విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది. ఇటీవల కోర్టు వంశీకి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా, అది నేటితో ముగిసింది. దాంతో, వంశీని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. 

మరోవైపు, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వంశీకి సీఐడీ కోర్టు మార్చి 28 వరకు రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News