Kevin Pietersen: ఆ కిక్కే వేరబ్బా.. ఢిల్లీ థ్రిల్లింగ్ విక్ట‌రీపై కెవిన్ పీట‌ర్స‌న్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

Kevin Pietersens Tweet on Delhi Capitals Thrilling Victory

  • నిన్న‌ విశాఖ వేదిక‌గా ల‌క్నోపై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్ట‌రీ
  • ఈ విజ‌యంపై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన‌ డీసీ మెంటార్ పీట‌ర్స‌న్
  • థ్రిల్లింగ్ మ్యాచ్ త‌ర్వాత నిద్ర‌లోంచి మేల్కొంటే పొందే అనుభ‌వం అద్భుతమ‌న్న కెవిన్‌

సోమ‌వారం విశాఖ వేదిక‌గా ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ థ్రిల్లింగ్ విక్ట‌రీని న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. యువ ఆట‌గాడు అశుతోశ్ శ‌ర్మ (31 బంతుల్లో 66 ర‌న్స్‌) చెల‌రేగ‌డంతో డీసీ 200 ప్ల‌స్ ప‌రుగులను ఛేదించి విజ‌యం సాధించింది. ఇక ల‌క్నోపై విజ‌యం త‌ర్వాత ఢిల్లీ క్యాపిట‌ల్స్ మెంటార్ కెవిన్ పీట‌ర్స‌న్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు.

"శుభోద‌యం డీసీ ఫ్రెండ్స్. థ్రిల్లింగ్ మ్యాచ్ త‌ర్వాత నిద్ర‌లోంచి మేల్కొంటే పొందే అనుభ‌వం అద్భుతం. ఇది సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన మ్యాచ్. ఢిల్లీ జ‌ట్టు పోరాడుతూనే ఉంటుంది. మ‌న గోల్‌ను చేరుకునేందుకు బ్యాట్‌, బాల్‌, ఫీల్డ్‌లో మ‌నం చాలా మెరుగుప‌రుచుకోవాల‌ని నాకు తెలుసు. ద‌య‌చేసి మాతో ప్ర‌యాణాన్ని ఆస్వాదించండి" అని పీట‌ర్స‌న్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) పోస్టులో పేర్కొన్నాడు. 

More Telugu News