Raja Singh: పోలీసులతో పెట్టుకోవద్దు: కేటీఆర్ కు రాజాసింగ్ వార్నింగ్

KTR Receives Strong Warning from Raja Singh

  • బీఆర్ఎస్ హయాంలో రేవంత్ ను జైలుకు పంపించారన్న రాజాసింగ్
  • రేవంత్ సీఎం అయినా వారిని ఏమీ చేయలేదని వ్యాఖ్య
  • రిటైర్ అయిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అంటున్నారని విమర్శ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత... రిటైర్ అయిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ మండిపడ్డారు. పోలీసులతో పెట్టుకోవద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా... గతంలో ఆయనను అరెస్ట్ చేయించిన వారిని ఏమీ చేయలేదని చెప్పారు. 

ఎవరు అధికారంలో ఉంటే వారు చెప్పిన విధంగా పోలీసులు లీగల్ గా చేస్తారని రాజాసింగ్ చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపించారని... తనపై కూడా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారని అన్నారు. తనను జైలుకు పంపించే సమయంలో సొంత బీజేపీ పార్టీ నేతలే పోలీసులకు మద్దతుగా నిలిచారని విమర్శించారు. ఇప్పటికీ తమ పార్టీలోని వారే తనకు వెన్నుపోటు పొడవాలనే ఆలోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News