Malavika Mohanan: ప్రభాస్ కు ఫిదా అయిపోయా: మాళవిక మోహనన్

Malavika Mohanans Admiration for Prabhas

  • ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్'లో నటిస్తున్న మాళవిక మోహనన్
  • ప్రభాస్ తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్య
  • ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటానన్న మాళవిక

కేరళ భామ మాళవిక మోహనన్ దక్షిణాదిన హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. 2013లో మలయాళ సినిమా 'పెట్టం పోలె'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాళవిక... మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడీగా 'ది రాజాసాబ్' సినిమాలో నటిస్తోంది. దీనికి తోడు 'సర్దార్ 2' అనే తమిళ సినిమా చేస్తోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రభాస్ మంచితనం, సహృదయతకు ఫిదా అయిపోయానని చెప్పింది. ప్రభాస్ వంటి గొప్ప వ్యక్తితో నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలో ఛాన్స్ రావడాన్ని లక్కీగా భావిస్తున్నానని... ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మించిన ఆనందం ఏముంటుందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. మరోవైపు హారర్ కామెడీ థ్రిల్లర్ గా 'ది రాజా సాబ్' తెరకెక్కుతోంది.

  • Loading...

More Telugu News