Donald Trump: వెనెజులా నుంచి ఆయిల్ కొనే దేశాలకు ట్రంప్ వార్నింగ్

Trump Warns Countries Buying Oil from Venezuela

  • 25 శాతం పన్నులు విధిస్తామని తేల్చిచెప్పిన అమెరికా అధ్యక్షుడు
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా.. ఎలా కొన్నా సరే టారిఫ్ లు తప్పవని వెల్లడి
  • భారత్, చైనాలపై పడనున్న ప్రభావం

వెనెజులా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశం నుంచి చమురు కానీ, గ్యాస్ కానీ కొనుగోలు చేసే దేశాలపై తాము 25 శాతం పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. వెనెజులా నుంచి చివరిసారిగా జరిపిన కొనుగోలు నుంచి ఏడాది వరకు ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ తో పాటు చైనాపైనా ప్రభావం పడనుంది. వెనెజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. 2024 జనవరిలో ఆ దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల్లో మెజారిటీ వాటా భారతదేశానిదే. రోజుకు దాదాపు 2.5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. గతేడాది విదేశాల నుంచి కొనుగోలు చేసిన మొత్తం ముడి చమురులో 1.5 శాతం వెనెజులా నుంచే దిగుమతి చేసుకుంది. అలాగే చైనాకు కూడా రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా ఎగుమతి చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్ ల ప్రభావం భారత్, చైనాలపై పడనుంది.

ఎందుకీ నిర్ణయం..
ట్రంప్ ఇటీవల అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారిని యుద్ధ విమానాలలో వారి వారి స్వదేశాలకు పంపిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా వెనెజులా పౌరులు 200 ల మందిని ప్రత్యేక విమానాల్లో ట్రంప్ వాపస్ పంపించారు. దీనిపై మండిపడ్డ వెనెజులా.. ఇకపై అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అదేసమయంలో అమెరికాకు చమురు ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. వెనెజులా నిర్ణయంపై మండిపడ్డ ట్రంప్.. తాజాగా ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయొద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అలా కొనుగోలు చేస్తే ఆయా దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై 25 శాతం పన్నులు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News