Shankar: చెన్నైలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు

Chennai Traffic Police Get AC Helmets

  • వేసవి ఎండల్లో ఇబ్బందుల మధ్య పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
  • ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందించిన అవడి పోలీసులు
  • 10 డిగ్రీల నుంచి మైనస్ 15 డిగ్రీల చల్లదన్నాన్ని ఇస్తున్న హెల్మెట్లు

ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండు వేసవిలో మండుటెండల్లో విధులు నిర్వహించాలంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని అవడి ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మైనస్ 15 డిగ్రీల చల్లదనాన్ని, 10 డిగ్రీల వెచ్చదనాన్ని ఇస్తాయి. వీటిని ధరించిన వారి మెడ క్రింది భాగం కన్నా తగ భాగంలో మూడు రెట్ల చల్లదనాన్ని హెల్మెట్లు ఇస్తాయి. 

అవడి సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ... ఈ హెల్మెట్ల వల్ల తలనొప్పి, అలసట వంటివి తగ్గుతాయని చెప్పారు. ఏసీ ఆన్ చేసినప్పుడు హెల్మెట్ లో కాస్త వైబ్రేషన్ వస్తుందని తెలిపారు. తమ పరిధిలో 334 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు పని చేస్తున్నారని... ప్రస్తుతం 50 మందికి ఏసీ హెల్మెట్లు ఇచ్చామని చెప్పారు. వీటి పనితీరును పరిశీలించిన తర్వాత మిగిలిన వారికి కూడా ఏసీ హెల్మెట్లు ఇస్తామని తెలిపారు.

Shankar
Chennai Traffic Police
AC Helmets
Traffic Police
Heatstroke Prevention
Police Equipment
Avadi City Police Commissioner
Summer Safety
  • Loading...

More Telugu News