Mega DSC: ఏప్రిల్ మొద‌టివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Naidus Announcement Mega DSC Notification in April

  • కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగం
  • జూన్‌లో పాఠ‌శాల‌లు తెరిచేలోపు నియామ‌కాలు పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌
  • ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌తోనే డీఎస్సీ భ‌ర్తీ చేస్తామ‌ని వెల్ల‌డి

ఏపీలోని నిరుద్యోగుల‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొద‌టివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌న్నారు. స‌చివాల‌యంలో జ‌రుగుతున్న కలెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. 

"గ‌త ఐదేళ్ల‌లో ఒక వ్య‌క్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌త పాల‌న‌తో విసిగి మాకు మ‌ద్ద‌తు ఇచ్చారు. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న‌, సంక్షేమం, అభివృద్ధి అందాలి. వ‌చ్చే నెల మొద‌టి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తాం. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌తోనే డీఎస్సీ భ‌ర్తీ చేస్తాం. జూన్‌లో పాఠ‌శాల‌లు తెరిచేలోపు నియామ‌కాలు పూర్తి కావాలి. 2027 నాటికి పోల‌వ‌రం పూర్తి చేసి తీరుతాం. అమ‌రావ‌తి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్‌. ప్ర‌పంచంలోనే బెస్ట్ మోడ‌ల్‌తో అమ‌రావ‌తిని అభివృద్ధి చేస్తాం"అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News