Mamata Banerjee: లండన్ పార్కులో మమతా బెనర్జీ జాగింగ్.. వీడియో ఇదిగో!

––
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లండన్ లో పర్యటిస్తున్నారు. బ్రిటన్ తో పశ్చిమ బెంగాల్ బంధాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో మమత ఈ అధికారిక పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం లండన్ చేరుకున్న మమతా బెనర్జీ.. సోమవారం ఉదయం స్థానిక హైడ్ పార్క్ లో జాగింగ్ చేశారు. తనదైన ప్రత్యేక ఆహార్యం తెల్ల చీర, వైట్ స్లిప్పర్స్ తో పార్కులో నడకతో మొదలు పెట్టి జాగింగ్ చేశారు. భద్రతా సిబ్బంది వెంట రాగా మమత జాగింగ్ చేస్తున్న వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కూనాల్ ఘోష్ తన అధికారిక ఎక్స్ లో పంచుకున్నారు.
లండన్ పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ లో పంచుకున్నారు. లండన్ కూడా కోల్ కతాలాంటి మహా నగరమేనని, గత చరిత్ర, నేటి డైనమిజం కలగలిసిన సిటీ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్ తో పశ్చిమ బెంగాల్ కు వందల సంవత్సరాల అనుబంధం ఉందని ఆమె గుర్తు చేశారు. సోమవారం అధికారిక కార్యక్రమాలు ప్రారంభించే ముందు లండన్ వాతావరణానికి అలవాటు పడేందుకు పార్క్ లో జాగింగ్ చేసినట్లు మమత తెలిపారు.