KL Rahul: తండ్రయిన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్

- పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన కేఎల్ రాహుల్ అర్ధాంగి అతియా శెట్టి
- సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్న దంపతులు
- రాహుల్, అతియా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ ప్రముఖులు, నెటిజన్లు
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అర్ధాంగి, బాలీవుడ్ నటి అతియా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రాహుల్, అతియా దంపతులు తల్లిదండ్రులు కావడం పట్ల ఆనందం వ్యక్తమవుతోంది. సోమవారం అతియా డెలివరీ అయ్యారు.
తమకు ఆడబిడ్డ జన్మించిన విషయాన్ని ఇరువురు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పరిణీతి చోప్రా, భూమి పెడ్నేకర్, అదితి రావు హైదరి వంటి సినీ ప్రముఖులతో పాటు పలువురు నెటిజన్లు రాహుల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా, రాహుల్, అతియా శెట్టిలు ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. వీరి వివాహం 2023లో జరిగింది.