BYD: టెస్లాను దాటేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ

BYD Surpasses Tesla in Revenue

  • సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని ఆవిష్కరించిన బీవైడీ
  • రాకెట్లా దూసుకెళ్లిన చైనా సంస్థ షేర్లు
  • 2024లో రూ.9.15 లక్షల కోట్ల ఆదాయం నమోదు

చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ బీవైడీ గత సంవత్సరం గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. స్టాక్ ఫైలింగ్ ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం, బీవైడీ 2024లో 777.1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.9.15 లక్షల కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. తద్వారా.... రూ.8.30 లక్షల కోట్ల ఆదాయంతో ఉన్న టెస్లాను అధిగమించింది. అంతేకాకుండా, ఈ సంస్థ విదేశాలలో కూడా విస్తరిస్తోంది. 

చైనా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో బీవైడీ అగ్రగామిగా నిలిచింది. 2023తో పోలిస్తే 29 శాతం వృద్ధిని సాధించింది. బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన 766 బిలియన్ యువాన్ల కంటే ఇది ఎక్కువ. బీవైడీ నికర లాభం రికార్డు స్థాయిలో 40.3 బిలియన్ యువాన్లకు చేరుకుంది. ఇది 2023 నుంచి చూస్తే 34 శాతం అధికం. 

బీవైడీ ఇటీవల కొత్త బ్యాటరీ సాంకేతికతను ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ప్రకటన తరువాత సంస్థ షేర్ ధరలు రాకెట్ లాగా దూసుకెళ్లాయి. బీవైడీ తాజా బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్ 1,000kW సామర్థ్యంతో ఛార్జ్ చేయగలదని పేర్కొంది, ఇది టెస్లా యొక్క సూపర్ ఛార్జర్ల కంటే వేగవంతమైనది. టెస్లా సూపర్ ఛార్జర్లు ప్రస్తుతం 500kW వేగంతో ఛార్జింగ్‌ను అందిస్తున్నాయి.

BYD
Tesla
Electric Vehicles
China
Electric Car Company
Battery Technology
EV Market
Charging Technology
Automotive Industry
  • Loading...

More Telugu News