TTD: రూ.5,258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్... అంచనాలు, కేటాయింపులు ఇవిగో!

TTD Announces Rs 525868 Crore Annual Budget

  • హుండీ ద్వారా రూ.1,729 కోట్ల ఆదాయ అంచనా
  • ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1,773.75 కోట్లు
  • స్విమ్స్ ఆసుపత్రికి రూ.120 కోట్లు కేటాయింపు
  • హిందూ ధర్మ ప్రచారానికి రూ.121.5 కోట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2025-26 సంవత్సరానికి గాను రూ.5,258.68 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదేశాల మేరకు అధికారులు వ్యయాలను క్రమబద్ధీకరించి, భక్తులకు మరింత మేలు జరిగేలా, హిందూ ధర్మ వ్యాప్తికి తోడ్పడేలా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.78.83 కోట్లు అధికం. కొంతమేర కేటాయింపులను తగ్గించారు.

ఈ బడ్జెట్‌లో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేశారు. హుండీ కానుకల ద్వారా రూ.1,729 కోట్లు, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ద్వారా రూ.1,310 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.600 కోట్లు, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.310 కోట్లు, ఆర్జిత సేవల టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.130 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గదులు, కళ్యాణమండపాల అద్దెల ద్వారా రూ.157 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.176.5 కోట్లు ఆదాయం సమకూరనుంది.

కేటాయింపుల విషయానికి వస్తే, ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.1,773.75 కోట్లు, ముడి సరుకుల కొనుగోలుకు రూ.768.5 కోట్లు, కార్పస్, బ్యాంక్ డిపాజిట్లకు రూ.800 కోట్లు కేటాయించారు. 

ఇంజనీరింగ్ పనుల కోసం రూ.350 కోట్లు, గరుడ వారధి పనులకు రూ.28 కోట్లు, స్విమ్స్ ఆసుపత్రికి రూ.120 కోట్లు కేటాయించారు. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీస్‌కు రూ.80 కోట్లు, ఇతర సంస్థల గ్రాంట్లకు రూ.130 కోట్లు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్టులు మరియు అనుబంధ ప్రాజెక్టులకు రూ.121.5 కోట్లు కేటాయించారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం కింద రూ.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, ఇతర యూనివర్సిటీల గ్రాంట్లకు రూ.189 కోట్లు కేటాయించారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం కోసం రూ.203 కోట్లు, నిఘా, భద్రతా విభాగానికి రూ.191 కోట్లు కేటాయించారు. 

టీటీడీ వైద్యశాలలకు రూ.41 కోట్లు, స్విమ్స్ గ్రాంట్స్ కు రూ.60 కోట్లు, బర్డ్, ప్రాణదాన‌ ట్రస్ట్ లకు రూ.55 కోట్లు కేటాయించారు.

  • Loading...

More Telugu News