B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు

Telangana Devotees Visit Tirumala on Recommendation Letters

  • నేటి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి
  • 550 నుంచి 600 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు వెల్లడి
  • సిఫారసుల లేఖలపై వచ్చిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనాలు

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మొదటి రోజు 550 నుంచి 600 మంది వరకు తెలంగాణ భక్తులు దర్శనం చేసుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈరోజు నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ నాయుడు స్పందించారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మొదటిరోజు పలువురు భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. 550 నుంచి 600 మంది వరకు భక్తులకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించినట్లు వెల్లడించారు.

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలిగించినందుకు తెలంగాణ భక్తులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. దర్శనం బాగా జరిగిందని, వసతులు కల్పించారని భక్తులు కొనియాడారు. వారు టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News