Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు

High Courts Crucial Orders for Borugadda Anil

  • గడువులోగా జైలు అధికారుల ముందు హాజరు కాలేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్
  • వివరణ ఇవ్వాలంటూ బోరుగడ్డకు హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా

టీడీపీ నేతలను దూషించిన కేసులో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కోర్టు నిర్దేశించిన గడువులోగా జైలు అధికారుల ముందు బోరుగడ్డ హాజరు కాలేదంటూ... హైకోర్టులో పోలీసులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... గడువులోగా జైలు అధికారుల ముందు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని బోరుగడ్డను ఆదేశించింది. 

తన తల్లికి అనారోగ్యం పేరుతో కోర్టులో తప్పుడు పత్రాలు సమర్పించిన వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News